It Gives Total Information in AP .It is realated to movies,politics,job info,Results
Breaking News
ఆహుతి ప్రసాద్ కన్నుమూత ... :(
టాలీవుడ్ లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆహుతి ప్రసాద్ కన్ను మూశారు. గత కొంత కాలంగా కేన్సర్ తో బాధపడుతున్న ఆహుతి, కిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు. విక్రం సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ప్రసాద్, 120 కి పైగా సినిమాల్లో యాక్ట్ చేశాడు. రెండు నంది అవార్డులు గెలిచిన ఆహుతి అసలు పేరు అడుసుమిల్లి జనార్దన వర ప్రసాద్. ఆహుతి కి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కృష్ణా జిల్లా కోడూరులో జన్మించిన ఆహుతి, ‘మా’ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశాడు. విలన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆహుతి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా మెప్పించాడు. గోదావరి యాసతో ప్రేక్షకులను మెప్పించిన ఆహుతి ప్రసాద్ చాలా హిట్ సినిమాల్లో నటించాడు. గులాబి, నిన్నే పెళ్ళాడతా, చందమామ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిద్దు ఫ్రం శ్రీకాకుళం, బెండు అప్పారావ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆహుతి నటించిన పట్ట పగలు,శంకర, రుద్రమ దేవి సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
Subscribe to:
Posts (Atom)