ఈ నెల 20 నుంచి
బ్రహ్మోత్సవాలు చేసుకుందాం అని మహేష్ మొన్న
ఆడియో వేడుకలో స్వయంగా ప్రకటించినా.. ఇంకా అభిమానుల్లో సందేహాలు
తొలగిపోలేదు. మహేష్ డబ్బింగ్ మొన్నే
పూర్తి చేసినట్లు.. మిక్కీ జే మేయర్-గోపీసుందర్
కలిసి రీరికార్డింగ్ హడావుడిలో ఉన్నట్లు.. ఇంకా మిక్సింగ్ కార్యక్రమాలేవో
జరుగుతున్నట్లు వార్తలొస్తుండటంతో బ్రహ్మోత్సవం అనుకున్న ప్రకారం 20న వస్తుందో రాదో
అని ఏదో మూల కొడుతోంది
అభిమానులకు. ఐతే ఆ సందేహాలన్నింటికీ
తెర దించేస్తూ ఈ రోజు సాయంత్రం
రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ
ఇచ్చేసింది బ్రహ్మోత్సవం టీం.
బ్రహ్మోత్సవం విడుదల ఈ నెల 20నే
అంటూ ఈ సాయంత్రం రిలీజ్
డేట్ పోస్టర్ రిలీజ్ చేసింది పీవీపీ సంస్థ. బ్యాగు పట్టుకుని ఠీవిగా నడుచుకు వస్తున్న మహేష్ ఫొటోతో ఈ
పోస్టర్ చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
బ్యాగ్రౌండ్లో కాశీ వాతావరణం కనిపిస్తోంది.
సినిమాలో మహేష్ బంధువుల మూలాల్ని
వెతుక్కుంటూ వెళ్లే పాత్రలో కనిపించనున్న నేపథ్యంలో సినిమా ఎసెన్స్ చెప్పేలా ఈ పోస్టర్ తీర్చిదిద్దారు.
ప్రపంచవ్యాప్తంగా
దాదాపు 2 వేల థియేటర్లలో సినిమాను
విడుదల చేయనున్నారు. ముందు రోజు అమెరికాలో
భారీ లెవెల్లో ప్రిమియర్ షోలు వేయనున్నారు. పీవీపీ
సంస్థ రూ.70 కోట్ల బడ్జెట్
తో తెరకెక్కించిన బ్రహ్మోత్సవంలో మహేష్ సరసన కాజల్..
సమంత.. ప్రణీత నటించారు.
దర్శకుడు: శ్రీకాంత్ అడ్డాల
సంగీత
దర్శకుడు : మిక్కీ జే మేయర్.