Breaking News

కోస్తాంధ్రపై ‘రోను’ ప్రతాపం





విశాఖ:  బంగాళాఖాతంలో ఏర్పడినరోనుతుపాను కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోను తుపాను ప్రస్తుతం మచిలీపట్నానికి ఆగ్నేయంగా 125 కిలోమీటర్లు, విశాఖపట్నానికి నైరుతి దిశలో 350 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 225 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది గంటకు 8 కిలో మీటర్ల వేగంతో ఒడిశా వైపు పయనిస్తున్నట్లు తెలిపింది. ‘రోనుశుక్రవారానికి ఆంధ్రా-ఒడిశా తీరంలో మరింత బలపడనున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్ర, ఒడిశాలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
కోస్తాఅతలాకుతలం 
రోను తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కేంద్రంతో పాటు గూడూరు, కావలి,నాయుడుపేట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ప్రకాశం, కృష్ణా, ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. తుపాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం ప్రభావిత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. తుపాను మరింత బలపడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్రూమ్లు ఏర్పాటుచేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలకు నిత్యావసరాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Designed By VungTauZ.Com