Breaking News

A TV Channel Pre Poll Survey shows 130 Seats to YSRCP

ఈ రోజు సాయంత్రం తాము చేసిన ప్రీపోల్ సర్వే ఫలితాలను ప్రకటిస్తాం.. అంటూ ఆది వారం రోజున హల్ చల్ చేసింది ఒక టీవీ చానల్. ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల శాంపిల్స్ తీసుకొని తాము ఒక సర్వేను చేశామని.. ఆ సర్వే ఫలితాలను తాము ప్రకటిస్తామంటూ ప్రకటనలతో ఊదరగొట్టింది ఆ చానల్. అయితే సాయంత్రానికి అది జరగలేదు. ఎన్నికల కమిషన్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయని, తాము ప్రీ పోల్ సర్వేను ప్రసారం చేయడం లేదని ఆ చానల్ వివరణ ఇచ్చుకొంది.
     మరి ఆ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయి? అనే విషయం గురించి పరిశీలిస్తే... సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 130 సీట్లు వస్తాయని తేలినట్టుగా చెబుతున్నారు ఆ టీవీ చానల్ జర్నలిస్టులు. నియోజకవర్గానికి మూడు వేల శాంపిల్స్ చొప్పున సేకరించి చేపట్టిన సర్వేలో వైకాపాకు 130 సీట్లు వస్తాయని, తెలుగుదేశం పార్టీకి 35 అసెంబ్లీ సీట్ల వరకూ దక్కే అవకాశం ఉందని మిగిలిన సీట్లు దక్కే అవకాశం ఉందని ఆ సర్వేలో తేలిందట. పది అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ , ఇతరులకు దక్కే అవకాశం ఉందని సమాచారం.


Designed By VungTauZ.Com