యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు నిజంగానే రాంగ్ టైం నడుస్తోంది. ఇప్పటికే రిలీజ్ కావలసిన ‘రభస’ సినిమా దర్శకనిర్మాతలు సంతోష్ శ్రీనివాస్ - బెల్లంకొండ సురేష్‌ల ఆఫ్ స్క్రీన్‌తో ఇంకా సెట్స్‌పైనే ఉంది. నెక్స్ట్ ఫిల్మ్ అయినా సెట్స్ మీద పెడదామనుకుంటే... సుకుమార్ ఇంకా పక్కాగా స్టోరీ వండలేదని, పూరీ జగన్నాధ్‌తో న్యూప్రాజెక్ట్ రెడీ చేస్కుంటే అదికూడా అటకెక్కిందనేది లేటెస్ట్ ఇన్‌సైడ్ న్యూస్.
20న జూనియర్ పుట్టిన రోజున ముహూర్తం అనుకున్నా... ఈ మూవీ ఇక మూలన పడినట్టేనని టాక్ నడుస్తోంది. పూరీ చెప్పిన రెండు స్టోరీ వెర్షన్స్ ఎన్టీఆర్‌కు నచ్చలేదని కరెక్ట్ చేయమని చెప్తే సెట్స్‌పై చేద్దామని అన్నాడని టాక్. అసలే కెరీర్ రైట్ ట్రాక్‌లో లేని ఈ టైంలో మరో ‘ఆంధ్రావాలా’ మనకెందుకని జూనియర్ ఈ ప్రాజెక్ట్‌కు బై చెప్పేశాడని సమాచారం. పూరీ ఈ సబ్జెక్ట్‌ను రానాతో చేయడానికి రెడీ అయ్యాడని ఫిల్మ్‌నగర్‌లో మాట్లాడుకుంటున్నారు.