యంగ్ టైగర్ ఎన్టీఆర్ , టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం 'నాన్నకు ప్రేమతో'. తండ్రి సెంటిమెంట్ తో ఎమోషనల్ గా సాగే ఈ చిత్రం ఫస్ట్ కాపి నిన్న రెడీ అయ్యింది. దీంతో ఈ రోజు ఉదయం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రానికి సెన్సార్ బృందం U/A సర్టిఫికేట్ ను జారి చేసింది. అయితే ఈ చిత్రంలో ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుందట. అలాగే ఎన్టీఆర్ ,జగపతి బాబు ల మధ్య జరిగే పోటా పోటి ని ఓ మైండ్ గేమ్ ల సుకుమార్ ప్రెసెంట్ చేయడం, ఎన్టీఆర్ స్టైలిష్ గెట్ అప్ లో కనిపించడం చాలా బాగుందని సెన్సార్ సభ్యులు చెప్తున్నారు. అయితే 'నాన్నకు ప్రేమతో' సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి కావడంతో ఈ చిత్రం ఖచ్చితంగా జనవరి 13 న సంక్రాంతి కానుకగా విడుదల కానుందని స్పష్టమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతాని ప్రేక్షకుల హాగ్ రెస్పాన్స్ వస్తోంది.ఈ చిత్రం తో యంగ్ టైగర్ ఎన్టీఆర్
భారీ హిట్ అందుకుంటాడని ఫ్యాన్స్ చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.