తారా చౌదరి మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. గతంలో చిన్నికృష్ణ తో ,ఆ తర్వాత రాజకీయ నాయకుడు రాయపాటి సాంబశివరావు తో ప్రాణహాని ఉందని మీడియా కు ఎక్కి పోలిస్ అధికారులతో గొడవకు దిగి రకరకాల వార్తల్లోకి ఎక్కి సెక్స్ రాకెట్ లో ఉన్నట్లు పలు ఆరోపణలు ఎదుర్కొన్న తారాచౌదరి తాజాగా తనని ఓ వాచ్ మన్ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పంజా గుట్ట పోలిస్ స్టేషన్ కు చేరుకుంది. తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా దాడి కి కూడా పాల్పడ్డాడని ,అతనికి ఓ కిరణా దుకాణ యజమాని కూడా సహకరిస్తున్నాడని ఆరోపించింది. తారాచౌదరి ఫిర్యాదు తో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.