బాలీవుడ్ హాట్ భామ ఆలియా భట్ కు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట! తెలుగులో నటించే చాన్స్ వస్తే ఎన్టీఆర్ తో నటిస్తానని అతను అయితేనే ఓకే అని అంటోంది. ఈ పొట్టి భామ పేరు అక్కినేని అఖిల్ తో నటించనుంది అని వినబడింది కానీ విచిత్రంగా ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టమని చెబుతోంది. బాలీవుడ్ లో స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ ,2స్టేట్స్ చిత్రాలతో సరికొత్త గ్లామర్ ప్రపంచాన్ని చూపించి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ పొట్టి సుందరి తాజాగా '' హంప్టీ కి శర్మ దుల్హనియా '' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఎన్టీఆర్ పై మనసు పారేసుకుందంటే త్వరలోనే తెలుగులో ఓ సినిమా చేయడం ఖాయం అనిపిస్తోంది.